Monday, February 7, 2011

ఆ రాతిరి



ఆ మొన్నటి రాతిరి నీ కౌగిలి లో
నీ వెచ్చని ఊపిరి ఊయలలో
నీ కమ్మటి పాట ఊహలలో
నీ చేతి శ్పర్స తాకిడి లో
నన్ను నేను మరిచిపోయే నీ మాటలతో
మైమరిచిపోయే నీ ప్రేమ లో
నా చెంపను తాకే నీ పెదవులతో
తియ్యటి ముద్దుల మాయలో
చలి గాలి తాకిడికి నా మేను నలుగుతుంటే
నీ వెచ్చని కౌగిలి లో భంధించి
నిదుర చేరని నా కల్లకి నిదురందించీ
నీవ్వున్న దైర్యంతో నిదురించాను ఆ రాతీరి
మరువలేను నిన్ను మరువలేను
ఎన్ని జన్మలైనా
సాటి ఉందా ??? నీ ప్రేమకు ?? అమ్మా ……

No comments:

Post a Comment